Ashok Gehlot is serious about student suicides in Kota : రాజస్థాన్లోని కోటాలో దేశంలోని పలు ప్రాంతాల విద్యార్థులు NEET, JEE వంటి పరీక్షలకు కోచింగ్ తీసుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. అయితే ప్రస్తుతం కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల ఉదంతాలు వరుసగా తెరపైకి వస్తున్నాయి. డాక్టర్, ఇంజనీరింగ్ కావాలన్న కలతో వచ్చిన 21మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత 8 నెలలుగా కోటాలో పెరుగుతున్న ఆత్మహత్యలపై గెహ్లాట్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. శుక్రవారం కోటా కోచింగ్ ఆపరేటర్లతో కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కోచింగ్ సెంటర్ల నిర్వహాకులను మందలించారు. ఆత్మహత్యలను అరికట్టేందుకు సూచనలు చేసేందుకు ఓ కమిటీ కమిటీని ఏర్పాటు చేసి 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
పూర్తిగా చదవండి..Ashok Gehlot : కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై సీరియస్.. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు గహ్లోట్ క్లాస్
రాజస్థాన్ లోని కోటాలో ఈమధ్యకాలంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం కోచింగ్ సెంటర్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి వారికి క్లాస్ పీకారు. ఆత్మహత్యలను అరికట్టేందుకు కమిటీ వేయాలని సీఎం గెహ్లాట్ అధికారులను ఆదేశించారు.

Translate this News:











