జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి సెగలు బయటపడ్డాయి. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్రహంపై సొంత పార్టీ నేతలే తిరుగబడ్డారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎర్రవల్లి చౌరస్తాలో ఎంపీపీ స్నేహ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన బీఆర్ఎస్ నాయకులు.. సుమారు 500 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. అబ్రహంకు మళ్లీ టికెట్ కేటాయించడంపై నిరసన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అతనికి బీ ఫామ్ ఇవ్వద్దంటూ ప్లకార్డులు చేతపట్టి జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. అబ్రహంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పూర్తిగా చదవండి..Jogulamba Gadwal: అలంపూర్ బీఆర్ఎస్లో వర్గ విభేదాలు
అలంపూర్ బీఆర్ఎస్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అబ్రహంకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ.. ఎంపీపీ వర్గం భారీ ర్యాలీ నిర్వహించింది. అబ్రహం ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగితే తాము సహకరించేది లేదని స్పష్టం చేశారు.

Translate this News:











