స్కిల్ డవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడి రెండో రోజు సీఐడీ విచారణ లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు చంద్రబాబుకు లంచ్ బ్రేక్ ఇచ్చారు అధికారులు. లంచ్ బ్రేక్ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన విచారణ సాయత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. దీంతో మిగిలిన ఈ 3 గంటల సమయం సీఐడీ అధికారులకు అత్యంత కీలక కానుంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత మేర చంద్రబాబు నుంచి కీలక వివరాలను రాబట్టాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు.
పూర్తిగా చదవండి..లంచ్ తర్వాత ప్రారంభమైన చంద్రబాబు విచారణ.. ఈ 3 గంటలే అత్యంత కీలకం.. సీఐడీ వ్యూహం ఇదే?
లంచ్ బ్రేక్ తర్వాత చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Translate this News:











