AP Elections: ఏపీలో సాధారణ ఎన్నికల నిర్వహణకు మార్చిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) తెలిపారు. ఇప్పటికే ఆగస్టులో ప్రారంభించిన ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే కొత్త ఓటర్ల నమోదు పూర్తి చేసింది ఈసీ. తాజాగా ముసాయిదా ఓటర్ల జాబితాను కూడా వెల్లడించింది. వాటిలో అభ్యంతరాలను డిసెంబర్ వరకూ స్వీకరించి అనంతరం వాటిని పరిష్కరించనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత జనవరి మొదటివారంలోనే తుది ఓటర్ల జాబితాను ప్రచురించనుంది. దీని ఆధారంగా వచ్చే ఏడాదిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Elections) నిర్వహణకు రెడీ అవుతోంది. ఇదే క్రమంలో వచ్చే ఏడాది మార్చిలో ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.
పూర్తిగా చదవండి..Big Breaking: ఏపీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. వచ్చే ఏడాది మార్చిలో ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.

Translate this News:











