పార్లమెంట్లో అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగేందుకు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా డబ్బులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం ఆయన తన స్వరాన్ని మరింత పెంచారు. మహువా మొయిత్రా లోక్‌సభ వెబ్సైట్ లాగిన్ వివరాలను ఓ వ్యాపారవేత్తకు అందజేసినట్లు ఆయన సోమవారం ఆరోపించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాల్సిందిగా.. కేంద్ర ఐటీశాఖ మంత్రి అయిన అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. లోక్‌సభ వెబ్సైట్లో తన లాగిన్ వివరాలను ఎంపీ మొయిత్రా.. వ్యాపారవేత్త హీరానందనీ అలాగే ఆయనకు సంబంధించిన రియల్ ఎస్టేట్ గ్రూప్‌నకు ఇచ్చినట్లు తెలిసిందని నిషికాంత్ అన్నారు. దీనిపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని.. ఈ ఆరోపణలను నిజమని తేలినట్లైతే ఇది తీవ్రమైన నేరం అవుతుందని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Mahua Moitra: మొయిత్రా లోక్‌సభ అకౌంట్‌ను చెక్ చేయాలి.. బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
టీఎంసీ ఎంపీ మహూవా మొయిత్రా పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె లోక్‌సభ వెబ్సైట్ లాగిన్ వివరాలను ఓ వ్యాపారవేత్తకు అందజేసినట్లు దుబే పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

Translate this News:











