Land rate on moon: చంద్రుడిపై చంద్రయాన్-3 సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్ అయింది. దీంతో, యావత్ ప్రపంచం భారత్‌కు సలాం కొట్టింది. అయితే ఇప్పుడు మరో చర్చ స్టార్ట్ అయింది. చంద్రుడిపై మనుషులు బ్రతకగలరా లేదా..?కానీ, ఈ క్వశ్చన్ కు ఎవరి దగ్గరా ఆన్సర్ లేదు.ఇదిలా ఉంటే కొందరు మాత్రం అప్పుడే చంద్రుడిపై స్థలాలు కూడా కొనేస్తున్నారు. తాజాగా తెలంగాణ(telangana)కి చెందిన ఓ యువతి ఏకంగా చంద్రుడిపై ఎకరం స్థలం కొనేసింది.
చందమామ రావే..జాబిల్లి రావే అని గోరుముద్దలు తినిపించిన తల్లికి ఆశ్చర్యపోయే గిఫ్ట్ ఇచ్చింది కూతురు. పెద్దపల్లి జిల్లా(peddapalli district) గోదావరిఖనికి చెందిన రాంచందర్, వకుళాదేవిల పెద్ద కూతురైన సాయి విజ్ఞత అమెరికాలో ఉంటోంది..ప్రతి సంవత్సరంలాగే తల్లికి మదర్స్ డే గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంది. కానీ, రొటీన్ గిఫ్ట్ కాకుండా.. కొత్తగా ఉండాలనుకుంది. ఫ్రెండ్ ఇచ్చిన ఐడియాతో ఏకంగా చంద్రుడిపైనే స్థలం కొనేసింది. ఆ స్థలాన్ని తల్లి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి.. గిఫ్ట్‌గా ఇచ్చింది. దీంతో, కొండంత ప్రేమ చూపిస్తున్న కూతుర్ని చూసి.. తల్లి ఫుల్ ఖుషీ అయింది.
Land On The Moon price: తల్లికి గిఫ్ట్‌గా.. చంద్రుడిపై స్థలం.. రేట్ ఎంతో తెలుసా..?
లూనార్ రిజిస్ట్రీ ప్రకారం.. చంద్రునిపై ఒక ఎకరం భూమి ధర USD 37.50 అంటే భారత్ కరెన్సీలో దాదాపు రూ. 3,100. ఈ నెల 23న సాయంత్రం 6:04 గంటలకు జాబిల్లి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వగా.. కొందరు మాత్రం అప్పుడే చంద్రుడిపై స్థలాలు కూడా కొనేస్తున్నారు. తాజాగా తెలంగాణకి చెందిన ఓ యువతి ఏకంగా చంద్రుడిపై ఎకరం స్థలం కొనేసింది.

Translate this News:












