Chandrayaan 3 updates : ఇదిరా ఇస్రో అంటే.. 100కు 100శాతం సక్సెస్ రేట్‌తో చంద్రయాన్-3 ప్రయోగం విజయాల పరంపరను కొనసాగిస్తోంది. ల్యాండర్, రోవర్ తమ పనిని అద్భుతంగా చేసుకుపోతున్నాయి. ఏ టైమ్‌కి ఏం చేయాలో అదే చేస్తూ ఇస్రో సైంటిస్టుల ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. అదే సమయంలో దేశ ప్రజలు హృదయాలను కొల్లగొడుతోంది. చంద్రయాన్-3 ప్రయోగంపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని ట్వీట్టర్ ద్వారా పంచుకుంటోంది ఇస్రో. తాజాగా మరో ట్వీట్ చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది.
పూర్తిగా చదవండి..Chandrayaan-3: రెండు టార్గెట్లు ఫినిష్.. ముచ్చటగా మూడోది కూడా.. ఇస్రో ట్వీట్ వైరల్!
మొత్తం మూడు లక్ష్యాలలో రెండు టార్గెట్లను సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేసింది చంద్రయాన్-3. జాబిల్లి ఉపరితలంపై సురక్షితమైన, సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్, చంద్రునిపై తిరిగే రోవర్ ప్రదర్శన సక్సెస్ అవ్వగా.. అటు పేలోడ్లు సాధారణంగా పని చేస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇస్రో ట్వీట్ చేసింది. మరోవైపు అంతకముందు రోవర్‌కి సంబంధించిన వీడియోను ఇస్రో పోస్ట్ చేసింది.

Translate this News:











