Chandrayaan-3: చంద్రయాన్ -3 మిషన్ లో భాగంగా ఆగస్టు 23న చంద్రుడిపై దిగిన విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) పై ఇస్రో కీలక విషయాన్ని వెల్లడించింది. చంద్రయాన్-3 (Chandrayaan-3) మిషన్‌కు చెందిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంతో చాలా దుమ్ము లేచిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శుక్రవారం తెలిపింది. దీని కారణంగా అంతరిక్ష నౌక చుట్టూ ప్రకాశవంతమైన ప్యాచ్ ఏర్పడింది. దీనిని ‘ఎజెక్టా హాలో’ అంటారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక పరిశోధనా పత్రం ప్రకారం, ఆగస్టు 23న చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి ముందు, తర్వాత చంద్రుని ఉపరితలాన్ని అధ్యయనం చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్-2 ఆర్బిటర్‌ను ఉపయోగించారు. హై రిజల్యూషన్ కెమెరాను ఉపయోగించారు.
పూర్తిగా చదవండి..Chandrayaan-3 Update: విక్రమ్ ల్యాండర్ గురించి ఇస్రో కీలక విషయం వెల్లడి…ఏం చెప్పిందంటే..?
చంద్రయాన్ -3 మిషన్ లో భాగంగా ఆగస్టు 23న చంద్రుడిపై దిగిన విక్రమ్ ల్యాండర్ పై ఇస్రో కీలక విషయాన్ని వెల్లడించింది. చంద్రుడిపై ల్యాండింగ్ సమయంలోనే విక్రమ్ ల్యాండర్ తనదైన ముద్రవేసిందని తెలిపింది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్, చంద్రుని దక్షిణ ధ్రువంపై చారిత్రాత్మక టచ్ డౌన్ చేస్తున్నప్పుడు చంద్రుని ఉపరితలంపై ఎజెక్టా హాలో ఏర్పడిందని వెల్లడించింది.

Translate this News:











