Chandrayaan-3 success meet : ఆగస్టు 23, 2023 గురువారం రోజున చంద్రుని దక్షిణం వైపున అడుగుపెట్టి భారతదేశం చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో అలా చేసిన మొదటి దేశం భారత్. ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ కూడా తమ పనిని ప్రారంభించాయి. ఇప్పటివరకు జాబిల్లికి సంబంధించిన ఎన్నో చిత్రాలను పంపించాయి. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 ల్యాండ్ అయిన సమయంలో, ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ (Modi BRICS)సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. దీంతో పాటు త్వరలో ముఖాముఖిగా అభినందిస్తానని తెలిపారు. ఈరోజు ప్రధాని మోదీ విదేశాల నుంచి తిరిగి వచ్చి నేరుగా బెంగళూరులోని ఇస్రో కమాండ్ సెంటర్కు చేరుకుని శాస్త్రవేత్తలను అభినందించారు.
పూర్తిగా చదవండి..Chandrayaan-3 Success Meet : అప్పుడు కన్నీళ్లతో…ఇప్పుడు ఆనందభాష్పాలతో…!!
ఆగస్టు 23న, చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ భాగం ఉపరితలంపై విజయవంతంగా దిగింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ అవతరించింది. 7 సెప్టెంబర్ 2019 చంద్రయాన్ -2 విఫలమవ్వడంతో ఇస్రో శాస్త్రవేత్తలు కన్నీళ్లు పెట్టుకున్న క్షణం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పటి ఇస్రో ఛైర్మన్ కె. శివన్ కన్నీళ్లు పెట్టుకున్న సందర్బంలో ప్రధాని మోదీ ఆయన్ను కౌగిలించుకుని ఓదార్చిన క్షణం యావత్ ప్రపంచాన్ని కదిలించింది. మీరు కన్న కలలు త్వరలోనే సాకారం అవుతాయని ప్రధాని మోదీ ఓదార్చిన తీరు యావత్ ప్రజలను కంటతడి పెట్టించింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. అప్పుడు కన్నీళ్లతో...ఇప్పుడు ఆనందభాష్పాలతో ఇస్రోలోకి అడుగుపెట్టారు మోదీ.

Translate this News:











