Chandrayaan-3 Landing in few more hours: 30 కిలో మీటర్ల ఎత్తునుంచి చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండ్ అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ల్యాండర్ మాడ్యుల్ పరిస్థితులను పరిశీలించి అన్ని పరిస్థితులు అనుకూలంగా వుంటే ఈ రోజ విక్రమ్ ల్యాండ్ అవుతుందన్నారు. ఏదైనా అసాధారణ పరిస్థితుల్లో ల్యాండింగ్ ను ఈ నెల 27కు వాయిదా వేసే అవకాశం ఉందని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Chandrayaan-3: మరి కొద్ది గంటల్లో చారిత్రాత్మక ఘట్టం .!తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు
చారిత్రాత్మక ఘట్టానికి మరి కొద్ది గంటలు మాత్రమే మిగిలి వుంది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్-3 మిషన్ చివరి ఘట్టానికి చేరుకుంది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 30 నిమిషాల సమయం పడుతుందని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు.

Translate this News:











