Chandrayaan-3: చంద్రయాన్-3పై ఇస్రో శాస్త్రవేత్తలు (ISRO Scientists)ఆశలు వదిలేసుకున్నారు. నిద్రాణస్థితిలో ఉన్న విక్రమ్ ల్యాండర్ (Vikram lander), ప్రజ్ఞాన్ రోవర్(Pragyan rover)ను మేల్కొలిపి పనిచేయించడం ఇక సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చేసినట్టు సమాచారం. చంద్రుని మీద 14 రోజులపాటు పరిశోధనలు చేసి విలువైన సమాచారాన్ని సేకరించిన తర్వాత విక్రమ్, ప్రజ్ఞాన్ లు రెండూ అక్కడ లూనార్ నైట్ (చంద్రుడిపై రాత్రి సమయం) ప్రారంభం కావడంతో నిద్రాణస్థితిలోకి వెళ్ళిపోయాయి.
పూర్తిగా చదవండి..Chandrayaan-3: అంతా అయిపోయింది…ఇక ఆశల్లేవు
ఇస్రో ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్-3 కథ ఇంక ముగిసినట్టే. చంద్రుని మీద ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు మేల్కొనే ఛాన్స్ కనిపించడం లేదని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితాలు కనిపించడం లేదని చెబుతున్నారు.

Translate this News:











