తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం, సీతానగరంలో చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన నిరసన దీక్షలో భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. ఏ కేసులో అయినా ఆధారం చూపి అరెస్టు చేస్తారని.. కానీ స్కిల్ కేసులో ఆధారాలు లేకుండా అరెస్టు చేసి.. ఇప్పుడు డబ్బులు ఎక్కడి వెళ్లాయని విచారిస్తున్నారని అన్నారు. ఇలాంటి విచిత్రాన్ని ఎవరూ ఎప్పుడూ చూసి ఉండరన్నారు. ‘చంద్రబాబు ప్రజల సొమ్మేమీ దోచుకోలేదు.. అయినా జైల్లో నిర్బంధించారు. ఆయన కోసం మీరందరూ పోరాటానికి వచ్చారు. ప్రజల మనిషిని జైల్లో వేసి 19 రోజులైంది. ఏం తప్పు చేశారో ఒక్కటన్నా నిరూపించారా..? చంద్రబాబు వేసిన ప్రశ్నలకు సీఐడీనే సమాధానం చెప్పలేకపోయింది. 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబుపై ఎన్నోకేసులు పెట్టారు, ఏ ఒక్కటైనా నిరూపించగలిగారా.? సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండి ప్రజల కోసమే చంద్రబాబు పని చేశారు. ఆయన ఊపిరి, ఆలోచనలో ఉంది ప్రజలే. యువతకు ఉద్యోగాలు రావాలంటే రాష్ట్రానికి ఏ పరిశ్రమ తీసుకొద్దామా..? అని ఆలోచిస్తారు. స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్ల ద్వారా 2 లక్షల మందికిపైగా యువతకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ ద్వారా ఉద్యోగాలు పొంది లక్షల్లో జీతాలు తీసుకుంటూ కొందరు సీఈవో స్థాయికి ఎదిగారు.
పూర్తిగా చదవండి..Nara Bhuvaneshwari: యువగళం ఆగదు.. చంద్రబాబుకు మద్ధతుగా ఉందాం: భువనేశ్వరి
స్కిల్ డెవలెప్మెంట్ కేసులో అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేశారు గానీ.. ఇప్పటికీ ఒక్క ఆధారమూ చూపించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. రూ.371కోట్లు దారిమళ్లించారని చెప్తున్నారని, కానీ అ డబ్బులు అసలు ఎక్కడికి వెళ్లాయో నిరూపించడం లేదన్నారు.

Translate this News:











