చంద్రబాబుకు బెయిల్ (Chandrababu Bail) రావడంతో కుటుంబ సభ్యులతో పాటు పార్టీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుమారుడు నారా లోకేష్, నారా బ్రాహ్మణి రాజమండ్రికి ఇప్పటికే చేరుకున్నారు. బెయిల్ వచ్చిన తర్వాత పలువురు నేతలు లోకేష్ ను కలిశారు. ‘యుద్ధం ఇప్పుడు ప్రారంభమైంది’.. అని నేతలు, కార్యకర్తలతో లోకేష్ అన్నట్లు తెలుస్తోంది. అయితే జైలు నుంచి విడుదల అనంతరం రాజమండ్రి నుంచి చంద్రబాబు నేరుగా తిరుపతికి వెళ్లనున్నట్లు సమాచారం. శ్రీవారి దర్శనం తర్వాత హైదరాబాద్ కు వెళ్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు చంద్రబాబు విడుదల కానున్న నేపథ్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాజమండ్రికి భారీగా చేరుకుంటున్నారు.
Chandrababu Bail: యుద్ధం ఇప్పుడే మొదలైందన్న లోకేష్.. చంద్రబాబు నేరుగా అక్కడికే..
test

Translate this News:











