సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఇసుకాసురుడు పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన బాబు.. జగన్ రూ.40వేల కోట్ల ఇసుక దోపిడీకి పాల్పడినట్లు సంచలన ఆరోపణలు చేశారు. 2022 నుంచి వైసీపీ నేతలకే ఇసుక దందా అప్పగించారని విమర్శించారు. ఇసుకలో వాటాల నిబంధనలు ఉల్లంఘించారని.. వ్యవస్థలను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్జీటీ, సుప్రీంకోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా తవ్వకాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్జీటీ ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. అనధికారికంగా 500కుపైగా ఇసుక రీచ్‌లలో దోపిడీ చేశారని… ఇసుకను నల్లబజారులో అధిక రేటుకు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..ChandraBabu: 10 ప్రశ్నలు.. 48 గంటలు.. సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్
సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఇసుకాసురుడు పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన బాబు ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా తాను చేసిన ఆరోపణలపై 48 గంటల్లో స్పందించాలని జగన్‌కు సవాల్ విసిరారు.

Translate this News:











