ఏపీలోని స్కిల్ డెవలాప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తూర్పు గొదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలులోని రిమాండ్లో ఉన్నారు. అయితే ఇప్పుడు బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చంద్రబాబుకు ప్రభుత్వాసుపత్రి వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకగడానే ఉందని చెబుతున్నారు. మరోవైపు జైలులో చంద్రబాబుకు ప్రమాదం ఉందని లోకేష్, భువనేశ్వరీ, బ్రాహ్మిణీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవలే ఆయన డీహెడ్రేషన్కు గురయ్యారని ఇప్పుడు చర్మ సమస్యతో బాధపడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఆయన్ని కావాలనే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన బరువు తగ్గిపోయారని.. ఇంకా తగ్గితే కిడ్నీలు పాడవుతాయని అంటున్నారు. అయితే శరీరానికి ఎక్కువగా చెమట పట్టడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. చంద్రబాబుకు ప్రస్తుతం ఆయన ఉంటున్న జైలులో ఏసీ లేనందువల్ల ఇలాంటి సమస్యలకు గురయ్యారని అంటున్నారు.
పూర్తిగా చదవండి..Chandrababu Naidu: చంద్రబాబుకు అసలేమైంది?.. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది?.. పూర్తి వివరాలు
ఏపీలోని స్కిల్ డెవలాప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తూర్పు గొదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలులోని రిమాండ్లో ఉన్నారు. అయితే ఇప్పుడు బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చంద్రబాబుకు ప్రభుత్వాసుపత్రి వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకగడానే ఉందని చెబుతున్నారు.

Translate this News:











