Chandrababu Naidu: స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై జ్యూడీషియల్ రిమాండ్‌లో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) నాయుడు జైలులో అస్వస్థతకు గురయ్యారు. ఆయన నీరసంగా ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు డీహైడ్రేషన్‌కు గురైనట్లు తెలుస్తోంది. అక్కడి వాతావరణ పరిస్థితులు, జైలులో గాలి లేకపోవడం కారణంగా చంద్రబాబు ఉక్కపోతకు గురయ్యారు. తాను డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నట్లు జైలు అధికారులకు, వైద్యాధికారులకు తెలియజేశారు చంద్రబాబు. దాంతో వైద్యులు ఆయనకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. కాగా, జైలులో సౌకర్యాల విషయమై.. తన కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారని, వారు చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన చేస్తున్నారు. పోలీసులు, వైద్యాధికారులు మాత్రం సమస్య ఏమీ లేదని, అవసరైన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Chandrababu: జైలులో చంద్రబాబుకు అస్వస్థత..
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై జ్యూడీషియల్ రిమాండ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలులో అస్వస్థతకు గురయ్యారు. ఆయన నీరసంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Translate this News:











