టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి(Chandrababu)కి మరోసారి కోర్టుల్లో ఎదురుదెబ్బ తగిలింది. ఏసీబీ కోర్టు సోమవారం నాడు చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై తీర్పును వెలువరించింది. రెండు పిటిషన్లను కొట్టివేసింది. అలాగే ఏపీ ఫైబర్ నెట్(AP fiber net), అంగళ్లు అల్లర్లు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పు వెలువడింది. మూడు పిటిషన్లనూ కొట్టివేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు తనపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సోమవారం నాడు విచారణ జరిగింది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణను జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం నేటికి వాయిదా వేసింది.
సుప్రీంకోర్టుపైనే ఆశలు..
Chandrababu case: చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ .. నెక్ట్స్ ఏం జరగబోతోంది?
ఏపీ స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్, కస్టడీ పిటిషన్లు ఏసీబీ కోర్టు కొట్టేసింది. అటు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఇక ఏపీ ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురైంది. అంగళ్లు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో బెయిల్ పిటిషన్లు కొట్టివేశారు. ఇటు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది

Translate this News:











