Chandhrababu Arrest Row: ఏపీలో రాజకీయం మరింత నాటకీయంగా మారుతోంది. గత నాలుగున్నరేళ్ళుగా వైసీపీ (YCP), టీడీపీ (TDP) కొట్టుకుంటూనే ఉన్నాయి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ప్రజల్లో మంచి పేరు సంపాదించడానికి ఎత్తులకు పైఎత్తులు వేసుకున్నారు. కానీ అదును చూసి విజృంభించింది వైసీపీ. నిత్యం నిప్పు అని చెప్పుకునే తన ప్రత్యర్థి చంద్రబాబుపై ఉన్న కేసులన్నింటినీ ఒకేసారి తెరపైకి తీసుకువచ్చింది. మూలన పడిన చిన్నా చితకా కేసులను కూడా దుమ్ముదులిపి మరీ తెరపైకి తీసుకువచ్చారు. తాజాగా పక్కా ఆధారాలతో స్కిల్ డెవలప్మెంట్ స్కాం (Skill Development Scam) లో చంద్రబాబును అరెస్ట్ సీఐడీ.. ఆయనపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (Amaravati Inner Ring Road case) కేసు సహా మరికొన్ని కేసులు పెట్టేందుకు సిద్ధమైంది. ఇక ఈ కేసులపై స్పందిస్తూ బాబు బావమరిది బాలయ్య.. “మా మీద మరిన్ని కేసులు పెడతారు. ఎవరికీ భయపడం, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం’’ అంటూ ఓ డైలాగ్ వేశారు. పద్యాలతో ప్రభుత్వంపై పంచ్ లు విసిరారు. ఇక జగన్ (YS Jagan) విసిరిన సవాలును అంతే ధీటుగా ఎదుర్కొంటామని టీడీపీ నేతలు సైతం కన్నెర్ర చేస్తున్నారు. ఇదిగో వీళ్ళందరూ ఇలా రియాక్ట్ అవ్వడమే జగన్ కు కావాల్సిందని స్పష్టంగా అర్ధమవుతోంది. పొలిటికల్ మైండ్ గేమ్ లో కాకలు తీరిన జగన్.. ఈ రియాక్షన్ లను తనకు ఫేవర్ గా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇలా కేసులతో టీడీపీ పీకల్లోతు కూరుకుపోయి ఎన్నికల్లో చతికిలబడేలా చేయాలన్నది వైసీపీ వ్యూహం!
పూర్తిగా చదవండి..Chandrababu: ఎన్నికల వరకు జైల్లోనే చంద్రబాబు? పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న వైసీపీ ప్రభుత్వం..!
నాలుగేళ్ళుగా కామ్ గా ఉన్న జగన్ ఒక్కసారిగా జూలు విదిల్చారు. ఇన్నాళ్ళు కేవలం మాటలతో, కేసులతో భయపెట్టారు. కానీ ఇప్పుడు ఏకంగా జైల్లోకి నెట్టారు. ఇలాగే ఒక దాని మీద మరొక కేసు పెట్టి కరెక్ట్ గా ఎన్నికల టైమ్ కి కేసులతో టీడీపీ చతికిలపడేలా చేయాలన్నది వైసీపీ వ్యూహం.

Translate this News:











