నేడు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్ పిటిషన్ పై మరోసారి ఏపీ హైకోర్టు విచారించనుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు A1 గా ఉన్నారు. దాంతో పాటూ అసైన్డ్ భూముల కేసులో కూడా హైకోర్టు ఈరోజు తీర్పును ఇవ్వనుంది. రాజధాని గ్రామాల పరిధిలో అసైన్డ్ భూములు సేకరణలో బాబు, మాజీ మంత్రి నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ 2021లో కేసు నమోదు చేసింది. దీని మీద ఇప్పటికే విచారణ ముగిసింది. దీని కోర్టు నేడు తీర్పును వెలువరించాల్సి ఉన్న నేపథ్యంలో కేసును రీ ఓపెన్ చేయాలని సీఐడీ కొత్తగా రెండు పిటిషన్లను దాఖలు చేసింది. అయితే ఈరోజు హైకోర్టులో పిటిషన్లను విచారిస్తారా లేక ఇప్పటికే విచారణ ముగిసిన నేపథ్యంలో తీర్పును వెలువరిస్తారన్న దానిపై ఉత్కంఠత నెలకొంది. అసైన్డ్ భూముల విషయంలో తాము ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని పేర్కొంటూ ఈ కేసును కొట్టేయాలని గతంలోనే కోర్టులో నారాయణ,చంద్రబాబు పిటిషన్లు వేశారు.
పూర్తిగా చదవండి..CHANDRABABU:నేడు హైకోర్టులో చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నేడు ఏపి హై కోర్టులో విచారణ జరగనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ లో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ కేసు నమోదు చేసింది. గత విచారణలో హైకోర్టు బాబును ఈరోజు వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది.

Translate this News:











