చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ మీద సుప్రీంకోర్టులో ఈరోజు విచారణకు రానుంది. గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా తనపై పెట్టిన కేసు కొట్టివేయాలని బాబు పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారించనున్నారు. ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బాబు తరుపు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత వారం ఈ కేసు కోర్టుకు రాగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఏస్వీఎన్ భట్టి ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఆ తరువాత విచారణ నుంచి జస్టిస్ భట్టి తప్పుకున్నారు. బాబు కేసుకు మరో బెంచ్ కేటాయించి ఈరోజు విచారణ జరుపుతామని తెలిపారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని ఆయన తరుపు లాయర్లు వాదించనున్నారు. సుప్రీంకోర్టులో 63వ ఐటమ్ గా లిస్ట్ అయింది. బాబు తరుపున సిద్ధార్ధ్ లూథ్రా, హరీశ్ సాల్వేలు లాయర్లగా ఉన్నారు. మరోవైపు ఈ కేసులో తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని ఏపీ ప్రభుత్వం కోర్టును కోరింది.
పూర్తిగా చదవండి..chandrababu case:చంద్రబాబు పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన పిటిషన్ మీద ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు జరగనుంది. జాబితాలో చిట్టచివరి కేసుగా బాబు కేసును లిస్ట్ చేశారు.

Translate this News:











