రాజకీయ విలువలను బ్రష్టు పట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబోయిన వేణు అన్నారు. చంద్రబాబు తన హయాంలో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో సుమారు 370 కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారన్నారు. ఐటీ, సీఐడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఉన్న భారతదేశంలో చంద్రబాబు లాంటి అవినీతిపరుడు ఎటూ తప్పించుకోలేరన్నారు. అతని స్కామ్‌లను ఈ దర్యాప్తు సంస్ధలే బయటపెట్టాయని మంత్రి తెలిపారు. చంద్రబాబు 70కి పైగా సెల్ కంపెనీల ద్వారా డబ్బును వెనక్కి రప్పించి తన ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుడు చంద్రబాబే అన్న మంత్రి.. అతని అభియోగంపై విచారించడానికి ఈ దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయన్నారు.
పూర్తిగా చదవండి..minister venu: చంద్రబాబు రాజకీయాలను బ్రష్టు పట్టించారు
రాజకీయ విలువలను బ్రష్టు పట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మంత్రి చెల్లబోయిన వేణు అన్నారు. చంద్రబాబు తన హయాంలో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో సుమారు 370 కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నారని మంత్రి వేణు ఆరోపించారు.

Translate this News:











