సినీనటుడు, తెలుగుదేశం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏం మాట్లాడినా ముఖంపైనే కామెంట్స్ చేస్తారు. బ్యాక్ నుంచి మాట్లాడడం బాలయ్య బాబుకు తెలియదు. ఏదైనా సినిమా స్టైల్లోనే డైలాగులు పేల్చుతారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. చంద్రబాబు అరెస్ట్ విషయంలో జూనియన్ ఎన్టీఆర్ ఇప్పటివరకు స్పందించని విషయం తెలిసిందే. దీనిపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు బాలయ్య బాబు సినిమా స్టైల్ డైలాగ్ పేల్చారు. జూ.ఎన్టీఆర్ స్పందించకపోతే ‘ఐ డోంట్ కేర్’ అంటూ కౌంటర్ వేశారు. తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీటీడీపీ నేతలతో బాలకృష్ణ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో టీటీడీపీ నేతలతో బాలకృష్ణ అత్యవసర భేటీ నిర్వహించారు.
పూర్తిగా చదవండి..Balakrishna vs Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే నాకేంటి? డోంట్ కేర్.. బాలయ్య బాబు కోపం మాములుగా లేదుగా..!
చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అని వ్యాఖ్యానించారు. సినిమా వాళ్లు స్పందించపోయినా తాను పట్టించుకోనన్నారు బాలయ్య బాబు.

Translate this News:











