Chandrababu Medical Checkup: నంద్యాల జిల్లా టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసినట్లు సీఐడీ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు ప్రభుత్వ వైద్యులు. ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్లైట్ ద్వారా చంద్రబాబును విజయవాడ తరలించారు. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అరెస్టు చేయడం, ఆరోపణలకు ఆధారాలు చూపకుండా అరెస్టు చేయడంపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆధారాలు చూపిస్తే చట్టానికి సహకరిస్తానని చంద్రబాబు చెప్పారు. అడ్వకేట్లను అవగాహన లేని లాయర్లు అంటూ దురుసుగా వ్యాఖ్యానించిన డీఐజీ రఘురామరెడ్డి. ప్రాథమిక సాక్ష్యం చూపాలని అడిగితే అన్నీ ఇస్తాం అంటూ మాట దాట వేశారు విచారణ అధికారులు. చంద్రబాబును అరెస్టు చేస్తున్నట్లు వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చారు పోలీసులు.
పూర్తిగా చదవండి..Chandrababu Medical Checkup: చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు.. వీడియో..!
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆయనకు మెడికల్ టెస్టులు చేశారు. ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్లైట్ ద్వారా చంద్రబాబును విజయవాడ తరలించారు. ఇది నాన్ బెయిలబుల్ నేరమని చెబుతూ బెయిల్పై విడుదల చేయలేమని నోటీసులో పేర్కొంది. మీరు కోర్టు ద్వారా మాత్రమే బెయిల్ కోరవచ్చు' అని సీఐడీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం ధనుంజయుడు నోటీసులో స్పష్టం చేశారు.

Translate this News:











