Minister Kottu Satyanarayana: విపక్ష నేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడం, సీఐడీ(CID) ఫోకస్ చేయడంపై ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ(Kottu Satyanarayana) తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబు, లోకేష్‌ల అరెస్ట్ తప్పదని అన్నారు. ‘బాబు-కొడుకుల అరెస్ట్ ఎలా జరుగుతుందనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. తండ్రి బ్రోకర్.. కొడుకు జోకర్. చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని ఐటీ శాఖ తేల్చింది. అమరావతిని చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కేంద్రంగా చేసుకున్నాడు.’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఐటీ నోటీసుల ద్వారా బయటపడింది ఆవగింజత మాత్రమే అని, చంద్రబాబు హాయాంలో వేల కోట్లు నామినేషన్ పద్ధతిన ఇచ్చేశారని, చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం.. సంచలన కామెంట్స్ చేసిన మంత్రి కొట్టు సత్యనారాయణ..
ప్రతిపక్షాలు ఇండియా అని పేరు పెట్టుకున్నారని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భారత్ అనే పేరు పెడుతున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇండియా పేరు భారత్‌గా మార్చడంపై అభిప్రాయాన్ని తమ నాయకుడు వైఎస్ జగన్ చెబుతారు. సీఎం జగన్ అభిప్రాయమే తమ అభిప్రాయం. భారత్ అని పేరు మార్చినంత మాత్రాన బయటివారు ఇండియా అని పిలవకుండా ఉంటారా?

Translate this News:











