రాజీనామా అనంతరం వారు మాట్లాడుతూ.. చల్లా నారాయణరెడ్డి అనే నేను, మీ పిలుపు మేరకు అప్పటి BRS పార్టీలో 2017లో చేరడం జరిగిందన్నారు. నేను అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాటారం మండల జడ్పీటీసీగా, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నానన్నారు. పార్టీలో చేరినప్పటి నుంచి ఈ రోజు వరకు బీఆర్ఎస్ కోసం అంకిత భావంతో, చిత్తశుద్ధితో పని చేశానని ఆయన తెలిపారు. కానీ.. నా అనుభవాన్ని, సుదీర్ఘ 40 ఏళ్ల రాజకీయ చరిత్రను దృష్టిలో పెట్టుకొని అయిన నాకు పార్టీ సముచిత స్థానం కల్పించలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాను.
పూర్తిగా చదవండి..Telangana News: మంథనిలో బీఆర్ఎస్కు షాక్… చల్లా నారాయణరెడ్డి పార్టీకి రాజీనామా
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కాటారం పీఏసీఎస్ చైర్మన్ చల్లా నారాయణరెడ్డి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరానన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం పని చేసినా.. పార్టీలో సరైన గుర్తింపు లేదన్నారు. ప్రజా వ్యతిరేకత ఉన్న అభ్యర్థికి, రౌడీ రాజకీయం చేసేవారికి టికెట్ కేటాయించడం కలిచి వేసిందన్నారు.

Translate this News:











