RRC Recruitment 2023: సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ డ్రైవ్ కొసం అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. భారతీయ రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెతుకుతున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ జూనియర్ ఇంజనీర్, లోకో పైలట్, గార్డ్/ట్రైన్ మేనేజర్ పోస్టుల కోసం మొత్తం 1,303 ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్సైట్, rrccr.com ని విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ GDCE కోటా ద్వారా నిర్వహించారు. ఆగస్టు 1, 2023 నాటికి రెగ్యులర్, అర్హత ఉన్న సెంట్రల్ రైల్వే ఉద్యోగులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు తప్పనిసరిగా ఆగస్టు 1, 2021న లేదా అంతకు ముందు రైల్వేలో పని చేయడం ప్రారంభించి ఉండాలి. పదవీ విరమణ చేసిన లేదా మరొక రైల్వేకు బదిలీ చేయబడిన వారు రిక్రూట్మెంట్ కోసం పరిగణించబడరు. మరో రెండు రోజుల్లో అప్లికేషన్ గడువు ముగుస్తుంది.
ఒక్కో పోస్టుకు భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య వివరాలు
Jobs: 1,303 రైల్వే జాబ్స్‌కి ముగుస్తున్న గడువు.. త్వరపడండి..!
1,303 రైల్వే జాబ్స్‌కి సెప్టెంబర్ 2తో గడువు ముగియనుంది. అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, గార్డ్/ట్రైన్ మేనేజర్ పోస్టులకు సెంట్రల్ రైల్వే రిక్రూట్ చేసుకుంటోంది. దరఖాస్తుదారుల వయసు కేటగిరీ వారీగా.. జనరల్ అభ్యర్థులు 42 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 45, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 47 ఏళ్లు మించకూడదు. అభ్యర్థులు తప్పనిసరిగా 2021 ఆగస్టు 1 లేదా అంతకు ముందు రైల్వేలో పని చేస్తూ ఉండాలి.

Translate this News:











