దోపిడీ, అవినీతి, అహంకారం కాంగ్రెస్ పార్టీ (Congress Party) డీఎన్ఏలోనే ఉన్నాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి (Kishan Reddy) ధ్వజమెత్తారు. ప్రజా సంపదను లూటీ చేయడంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డబ్బులు కర్ణాటక నుంచి వస్తున్నాయని ఆరోపించారు. బెంగళూర్ ఆర్టీనగర్ లో ఒక కాంగ్రెస్ నేత ఇంట్లో రూ.42 కోట్లు బయట పడ్డాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లూటీ కొనసాగుతోందన్నారు. ఛత్తీస్ ఘడ్ లో ఆవు పేడ కుంభకోణం బయట పడిందని.. కాంగ్రెస్ పార్టీ ఆఖరికి ఆవు పేడను కూడా వదలడం లేదంటూ నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ చేసింది జోడో యాత్ర కాదు ఇండియా లుటో యాత్ర అంటూ విమర్శలు గుప్పించారు. జలయజ్ఞం, భూ యజ్ఞం పేరుతో కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేసిందన్నారు.
ఇది కూడా చదవండి: Telangana Elections: రేవంత్‌ను పొల్లు పొల్లు తిట్టిన పొన్నాల లక్ష్మయ్య, కేటీఆర్.. ఏమన్నారంటే..
Kishan Reddy: కాంగ్రెస్ ఆఖరికి ఆవు పేడను కూడా వదలదు.. పొన్నాల లక్ష్మయ్య పెనంలోంచి పొయ్యిలో: కిషన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్ గడ్ లో ఆవు పేడ కుంభకోణం బయట పడిందని.. కాంగ్రెస్ పార్టీ ఆఖరికి ఆవు పేడను కూడా వదలడం లేదంటూ నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 9 ఏళ్లలో కమిషన్ల రూపంలో దోచుకున్న సొమ్మును ఖర్చు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్న పొన్నాల లక్ష్మయ్య పెనంలోంచి పొయ్యిలో పడుతున్నారన్నారు.

Translate this News:











