కులం పేరుతో దేశాన్ని విడదీసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. బీహార్ ప్రభుత్వం వివాదాస్పద కుల ఆధారిత జనాభా గణనను విడుదల చేసిన కొన్ని గంటల తర్వాత మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రధాని తన ప్రసంగంలో సర్వే గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. పేదల మనోభావాలతో ప్రతిపక్షాలు ఆడుకుంటున్నాయని ఆరోపించారు. ‘అప్పట్లో పేదల భావోద్వేగాలతో ఆడుకున్నారు. ఈ రోజు కూడా వారు అదే ఆటను ఆడుతున్నారు. గతంలో కులం పేరుతో దేశాన్ని విడగొట్టారని… ఈ రోజు వారు అదే పాపం చేస్తున్నారు. గతంలో వారు అవినీతికి పాల్పడ్డారని… ఈ రోజు వారు మరింత అవినీతిపరులు” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్టు సమాచారం.
పూర్తిగా చదవండి..Modi On Caste Census: కులం పేరుతో దేశాన్ని విడగొడుతున్నారు.. కుల గణన నివేదిక తర్వాత మోదీ వ్యాఖ్యలు!
బీహార్ కుల గణన నివేదిక రాజకీయంగా పెద్ద రచ్చ లేపుతోంది. తమ రాష్ట్రంలో కులాల లెక్కలను నితీశ్ సర్కార్ బహిర్గతం చేసింది. కులాల ప్రతిపాదికన జనాభా గణన జరగాలని కాంగ్రెస్ సహా అనేక యాంటీ బీజేపీ పార్టీలు పట్టుపడుతున్న వేళ ఈ నివేదిక రిలీజ్ అయ్యింది. దీనిపై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు గుప్పించారు. కులం పేరిట దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

Translate this News:











