Certificate courses for digital world jobs: డిజిటల్ యుగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడంతా టెక్ కెరీర్ చుట్టూనే యువత అడుగులేస్తోంది. విపి ఆఫ్ టెక్నాలజీ లేదా ఐటి మేనేజర్ లాంటి అధిక వేతనం కలిగిన టెక్ జాబ్స్‌కి చదువుతో పాటు అనుభవం అవసరం. ఐటి కెరీర్లో విజయానికి చాలా మార్గాలు ఉన్నాయి. ప్రొఫెషనల్ సర్టిఫికేట్లు అవసరమైన నైపుణ్యాలను పొందడానికి వేగవంతమైన మార్గాన్ని అందిస్తాయి. మీ సామర్థ్యాన్ని అందరికి కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. గూగుల్(Google), మైక్రోసాఫ్ట్(microsoft) లాంటి దిగ్గజ కంపెనీల నుంచి సర్టిఫికేషన్ సాధిస్తే మీ కెరీర్‌కి తిరుగుండదు. కోర్సెరా సర్వే ప్రకారం దేశంలో 92శాతం కంపెనీ బాస్‌లు మైక్రో-క్రెడెన్షియల్స్ ఉన్న అభ్యర్థలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Careers: ఈ ఐదు సర్టిఫికేట్ కోర్సుల్లో ఒకటి చేస్తే చాలు.. లక్షల్లో జీతం సంపాదించుకోవచ్చు!
డిజిటల్ వరల్డ్‌లో టెక్నాలజీపై పట్టు ఉంటే మార్కెట్ క్రియేట్ చేసే ఎలాంటి అవకాశాలనైనా అందిపుచ్చుకోవచ్చు. ట్రెడిషనల్ డిగ్రీలతో కెరీర్ సెట్ అవ్వడానికి చాలా మంది సర్టిఫికేట్ కోర్సులవైపు మొగ్గుచూపుతున్నారు. గూగుల్ ఐటి సపోర్ట్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్, గూగుల్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్, మెటా డేటాబేస్ ఇంజనీర్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ లాంటి కోర్సులతో టెక్నాలజీ పరంగా మీ కెరీర్‌కు బలమైన పునాది పడుతుంది.

Translate this News:














