రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. విజయవాడలో జరిగిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బర్త్ డే వేడుకకు రామకృష్ణా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సజ్జల.. రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయలేకపోయానని తనను తాను తిట్టుకోవాల్సిన చంద్రబాబు.. ప్రజలకు మంచి చేస్తున్న జగన్ను ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించారు. గతంలో వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకగా మారుతుందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ఫ్రీ స్కీమ్లు ఎందుకు ప్రకటిస్తున్నారన్నారు. ఇప్పుడు సీఎం జగన్ ఒక్క రూపాయి ఇస్తానంటే చంద్రబాబు 100 రూపాయలు ఇస్తానని హామీలు ఇస్తున్నారన్నారు. చంద్రబాబు ఇచ్చే హామీలు హామీలుగానే మిగిలిపోతాయే తప్ప అవి అమలు కావన్నారు.
పూర్తిగా చదవండి..Sajjala Ramakrishna Reddy: ప్రజలకు ఏం చేశారో చంద్రబాబు చెప్పగలరా.?
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ఆగం చేయాలని చూస్తున్నారని ప్రభుత్వ ప్రధాన సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో బాబు ఓ పక్క, దత్తపుత్రుడు, మరోపక్క, తన సుపుత్రుడు ఇంకోపక్క తిరుగుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మంచి చేయని చంద్రబాబు.. మంచి చేస్తున్న జగన్ను ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించారు.

Translate this News:











