ఉద్యోగాలకు సంబంధించిన అర్హతల విషయంలో తెలంగాణ హైకోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తక్కువ విద్యార్హత ఉండే ఉద్యోగానికి ఎక్కువ విద్యార్హతలున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చా? అనే దానిపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. జాబ్ నోటిఫికేషన్లో ఇచ్చిన దానికంటే ఎక్కువ విద్యార్హతలు ఉన్న ఓ వ్యక్తి ఆ ఉద్యోగం కోసం దరఖాస్తు చేయకుండా నిరోధించవచ్చా? అనే విషయంపై వివరణ కోరుతూ ఓ మహిళ తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ (అటెండెంట్) జాబ్‌కు అప్లై చేసుకున్న ఆమెను ఇంటర్వ్యూకి పిలవకపోవడంపై ఆమె కోర్టును ఆశ్రయించింది.
పూర్తిగా చదవండి..తక్కువ విద్యార్హతలున్న జాబ్‌కు ఎక్కువ క్వాలిఫైడ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా..
తక్కువ విద్యార్హత ఉండే ఉద్యోగానికి ఎక్కువ విద్యార్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చా అనేదానిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే అది అటెండర్ పోస్టు కాబట్టి క్కువ విద్యార్హత కలిగిన వ్యక్తులు ఆ విధులు నిర్వహించడం కష్టంగా ఉంటుందని.. ఈ నిర్ణయం వెనుక ఆచరణాత్మక అవరోధాలు ఉంటాయని.. హైకోర్టు తరపు స్టాండింగ్ కౌన్సెల్ స్వరూప్ తెలిపారు. అయితే ఆమె ఇప్పటి వరకూ ఇంటర్,డిగ్రీ పరీక్షలలో ఉత్తీర్ణత పొందలేదు కాబట్టి ఆమె ప్రస్తుత విద్యార్హత 10వ తరగతి మాత్రమే అవుతుందని పిటీషనర్ తరపు న్యాయవాది శ్రవణ్ కూమార్ అన్నారు.

Translate this News:











