రానున్న ఎన్నికల్లో ప్రజలంతా తన వెంటే ఉన్నారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం నాడు ఆర్టీవీతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు.. ఎన్నికలంటే అందరికీ భయంగా ఉంటే తమకు మాత్రం సంబరంలా ఉందన్నారు. పండుగ వాతావరణంలో ప్రజలు తనను గెలిపించుకుంటామని చెబుతున్నారని నోముల తెలిపారు. ప్రతి గ్రామంలో నాయకులు, యువత తనను గెలిపించేందుకు ముందుకొస్తున్నారని, గత ఉప ఎన్నికల కంటే ఈసారి ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళుతున్నామన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని వివరించారు.
పూర్తిగా చదవండి..మరోసారి బానిసల్లా మారం.. నాగార్జునసాగర్ లో బీఆర్ఎస్ Vs కాంగ్రెస్
గత 36 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న జానారెడ్డి తన కుటుంబం మొత్తాన్ని హైదరాబాద్‌లోనే ఉంచారని, ఇక్కడ కనీసం నివాసం కూడా లేదన్నారు. ఇప్పుడు ఆయన కొడుకు వచ్చి మండలానికి ఒకరికి బాధ్యతలు అప్పజెప్పి హైదరాబాద్‌లో ఉంటూ.. మరో 20 ఏళ్లు మమ్మల్ని బానిసలుగా మారుస్తారన్న భయం ప్రజల్లో ఉందన్నారు. ఆయన కొడుకు వచ్చినా, ఆయన వచ్చినా బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు.

Translate this News:











