బీఆర్ఎస్ కీలక నేత కొప్పుల హరీశ్వర్ రెడ్డి (Koppula Hareeshwar Reddy) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ చికిత్స తీసుకుంటున్న హరీశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పరిగి నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి హరీశ్వర్ రెడ్డి కుమారుడు మహేశ్ రెడ్డి (Koppula Mahesh Reddy) ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి కేటీఆర్ (Minister KTR), బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో (G Kishan reddy) పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. నేడు పరిగి పట్టణంలో హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హరీశ్వర్ రెడ్డికి నివాళులర్పించేందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తదితరులు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Big Breaking: బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..
బీఆర్ఎస్ కీలక నేత, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ చికిత్స తీసుకుంటున్న హరీశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు.

Translate this News:











