తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు (BRS) టీఆర్ఎస్ (TRS) రూపంలో షాక్ తగిలే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది కాదా.. ఇదేంటి అనుకుంటున్నారా?.. అయితే.. ఈ స్టోరీ చదవండి. తుపాకుల బాలరంగం అధ్యక్షుడిగా తెలంగాణ రాజ్య సమితి పార్టీ (TRS) ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయ్యింది. ఈ పార్టీకి ఎన్నికల గుర్తుగా గ్యాస్ సిలిండర్ ను ఈసీ కేటాయించింది. దీంతో రాష్ట్రంలోని 119 స్థానాల్లో ఈ పార్టీ తరఫున అభ్యర్థులు బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అయితే .. టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) ని భారత్ రాష్ట్ర సమితిగా ఏడాది క్రితం మార్చారు సీఎం కేసీఆర్. అయితే.. ప్రజల్లో ఇంకా టీఆర్ఎస్ పేరే వినిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Sarpanch Navya: పార్టీ ఏదైనా.. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తా.. సర్పంచ్ నవ్యతో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ..!!
TS Elections 2023: తెలంగాణ ఎన్నికల బరిలో కొత్తగా TRS.. మరి BRS కు ఇబ్బందేనా?
రానున్న తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ రాజ్య సమితి పార్టీ (TRS) పేరిట ఓ కొత్త పార్టీ బరిలోకి దిగనుంది. దీంతో బీఆర్ఎస్ గా మారిన నాటి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఈ కొత్త TRS పార్టీకి గ్యాస్ సిలిండర్ ను గుర్తును కేటాయించింది ఎన్నికల కమిషన్.

Translate this News:











