బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. తెలంగాణలో రాజకీయ వేడిని ఒక్కసారిగా పెంచింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు కేటాయించడంపై ప్రతిపక్ష నేతలు కేసీఆర్పై సెటైర్లు వేస్తున్నారు. అలాగే మహిళలకు తక్కువ సీట్లు కేటాయించడంపైనా విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ టికెట్ల పంపిణీపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు కవిత.
పూర్తిగా చదవండి..Kavitha: కిషన్ రెడ్డికి కవిత కౌంటర్.. మహిళా బిల్లుపై ప్రశ్నల దాడి
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ రెండుసార్లు హామీ ఇచ్చి మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. భారీ మెజారిటీ ఉన్నప్పటికీ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని నిలదీశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

Translate this News:











