బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈసారి కూడా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కావడం లేదు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమె హస్తం ఉందన్న ఆరోపణలతో ఈడీ విచారణకు నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో కవిత ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే దానికి హాజరుకాకూడదని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లీగల్ నోటీసుల మీద న్యాయ విచారణ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ ను కొట్టేస్తే అప్పుడు ఈడీ విచారణకు వెళ్ళాలని కవిత డిసైడ్ చేసుకున్నారని తెలుస్తోంది. కవితకు బదులుగా ఆమె లాయర్లు ఢిల్లీ వెళ్ళనున్నారు.
పూర్తిగా చదవండి..MLC Kavita: ఈడీ కోర్టుకు వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్న కవిత
ఢిల్లీ మద్యం స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు పంపించింది. దాని ప్రకారం ఆమె ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ విషయం తేలేవరకూ ఈడీ విచారణకు హాజరు కాకూడదని కవిత నిర్ణయించుకున్నారు.

Translate this News:











