ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు (Telangana Politics) రోజురోజుకూ మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో (BRS Party) టికెట్ దక్కని నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువ మంది హస్తం గూటికి (Congress Party) చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే తెలుస్తోంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నేడో రేపో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధం అయ్యారు. తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ స్థానం కోసం టికెట్ ఆశించి భంగపడ్డ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్ ను వీడనున్నట్లు ప్రచారం సాగుతోంది. 2018 ఎన్నికల సమయంలోనే టీఆర్ఎస్ టికెట్ కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. అయితే.. జైపాల్ యాదవ్ కు కేసీఆర్ టికెట్ కేటాయించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.
పూర్తిగా చదవండి..Telangana Politics: బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వనున్న ఎమ్మెల్సీ.. కాంగ్రెస్ టికెట్ ఫిక్స్?
అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ సమక్షంలో త్వరలోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. కల్వకుర్తి అసెంబ్లీ టికెట్ ఇస్తామన్న హామీతో ఆయన హస్తం గూటికి చేరుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

Translate this News:












