ట్విట్టర్ లో కేటీఆర్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ మీద విరుచకుపడ్డారు. కొత్త వాటికి శంకుస్థాపన చేయడం సరే కానీ… కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యార్ ఉక్కు కర్మాగారం, పాలమూరు ప్రాజెక్టకు జాతీయ హోదా ల మాట ఏం చేశారంటూ కేటీఆర్ ప్రశ్నలు వేశారు.మా మూడు ప్రధాన హామీల సంగతేంటంటూ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రధాని మోదీని ప్రశ్నించారు. మూడురోజుల వ్యవధిలో తెలంగాణకు రెండోసారి వస్తున్నారని.. మరి ఆ మూడు విభజన హక్కులకు దిక్కేదని నిలదీశారు. 1. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు ? 2. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు ? 3. మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు ? అంటూ ప్రశ్నించారు. పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర, మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు.. గుండెల్లో గుజరాత్‌ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా అంటూ విమర్శించారు. మూడు రోజుల తేడాలో రెండోసారి తెలంగాణకు వస్తున్నారు..కానీ మా మూడు ప్రధాన హామీల మాటేంటని అడిగారు. పదేళ్ళ నుంచి చెబుతున్న అబద్ధాలను ఇంకెంత కాలం చెబుతారు…తెలంగాణ మీద మీ మనసు కరిగేదెప్పుడు అంటూ క్వశ్చన్ చేశారు.
పూర్తిగా చదవండి..KTR TWEET ON MODI:ఇంకెన్నాళ్ళు అబద్ధాలు చెబుతారు- ప్రధాని మోదీ మీద కేటీఆర్ సెటైర్లు
నరేంద్ర మోదీ ఈ రోజు తెలంగాణ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మోదీ మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటటైర్లు వేశారు. తెలంగాణ గోస తీరేదెప్పుడు అంటూ ట్విట్టర్లో ప్రశ్నల వర్షం కురిపించారు.

Translate this News:











