తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు నిధులను రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు కానీ, నవంబర్ 30న పోలింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కానీ విడుదల చేసేలా జోక్యం చేసుకోవాలంటూ కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈనేపథ్యంలో రైతుబంధు స్కీంను ఆపాలంటూ ఈసీకి ఏఐసీసీ ఇంచార్జీ మాణిక్రావు ఠాక్రే లేఖ రాశారు. రైతుల ఖాతాలో నగదు జమను ఆపాలంటూ లేఖలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ రాసిన లేఖపై అధికార బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. తెలంగాణ రైతులకు ద్రోహం చేసేలా కాంగ్రెస్ మరో కుట్రకు తెరలెప్పింది అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రైతు సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుతంత్రం పన్నుతుందంటూ మండిపడింది. కాంగ్రెస్ రైతు విద్రోహ చర్యలపై అన్నదాతలు సైతం విమర్శిస్తున్నారు. రైతులంతా కేసీఆర్ వెంట ఉన్నారన్న అక్కసుతోనే కాంగ్రెస్ ఇలాంటి కుట్రలు చేస్తోదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
పూర్తిగా చదవండి..BRS Fire : ఆ సమయంలో రైతుబంధు విడుదల ఆపాలని ఈసీకి కాంగ్రెస్ లేఖ.. భగ్గుమన్న బీఆర్ఎస్..!!
ఎన్నికల సమయంలో రైతు బంధు నిధుల విడుదల ఆపాలని కాంగ్రెస్ ఈసీకి లేఖ రాయడాన్ని..బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుబట్టింది. తెలంగాణ రైతులకు ద్రోహం చేసేలా కాంగ్రెస్ మరో కుట్రకు తెరలేపిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ అడ్డుకునే కుట్ర చేస్తుందంటూ ఫైర్ అయ్యింది. కాంగ్రెస్ రైతు విద్రోహ చర్యలపై అన్నదాతలు సైతం మండిపడుతున్నారని బీఆర్ఎస్ అంటోంది. రైతుబంధుపై కాంగ్రెస్ అక్కసును తీవ్రంగా ఖండించింది. రైతులంగా కేసీఆర్ వెంట ఉన్నారన్న కారణంతోనే కాంగ్రెస్ ఇలాంటి కుట్రలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఐసీసీకి కాంగ్రెస్ రాసిన లేఖపై మండిపడుతూ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ప్రకటన విడుదల చేశారు.

Translate this News:













