Boney Kapoor – Sridevi: బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్(Boney Kapoor) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేవకన్యగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న దివంగత నటి శ్రీదేవి(Sridevi) భర్తగా, మూవీ ప్రొడ్యూసర్‌గా సినీ ప్రేక్షక లోకానంతటికీ ఆయన సుపరిచితమే. 24 ఫిబ్రవరి, 2018లో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు శ్రీదేవి. ఈ లోకంలో ఆమె లేకపోయినప్పటికీ.. అభిమానుల మనసులో చిరకాలం నిలిచే ఉంటారు. తాజాగా బోనీకపూర్ తన భార్య శ్రీదేవి గురించి చాలా ఇంట్రస్టింగ్ విశేషాలు వెల్లడించారు. ఆయన మృతికి సంబంధించిన వివరాలు మొదలు.. తమ పెళ్లి, పిల్లలు సహా అనేక వివరాలను మీడియాతో పంచుకున్నారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనీ కపూర్.. తమ రహస్య పెళ్లి, ఆ పెళ్లికి ముందే శ్రేదేవి గర్భవతి కావడానికి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Boney Kapoor – Sridevi: పెళ్లికి ముందే శ్రీదేవి గర్భవతి.. సంచలన విషయాలు రివీల్ చేసిన బోనీకపూర్..
జూన్ 2న షిర్డీలో శ్రీదేవితో నా వివాహం జరిగింది. ఆ రాత్రి అక్కడే గడిపాము. జనవరి 1997లో, ఆమె గర్భవతిగా నిర్ధారణ అయ్యింది. ఇక మా వివాహ బంధాన్ని బహిర్గతం చేయడం తప్ప మాకు వేరే మార్గం కనిపించలేదు. పబ్లిక్‌గా మేము జనవరి 1997లో వివాహం చేసుకున్నాం. శ్రీదేవి పెళ్లికి ముందే గర్భవతి అని, ఆమె మొదటి గర్భం ద్వారా జన్మించన వ్యక్తి జాన్వి అని చాలా మీడియా సంస్థలు రాసుకుంటాయి. కానీ, వాస్తవం ఇది.' అని బోనీ కపూర్ వెల్లడించారు.

Translate this News:











