Bonda Uma warns YCP: వైసీపీపై విజయవాడ సెంట్రల్లో బోండా ఉమా సంచలన కామెంట్స్ చేశారు. రాష్టంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హిందూ ధర్మం అంటే గౌరవం లేదని మండిపడ్డారు. హిందూ ధర్మం నియమాలు పాటించకుండా ఉన్నారని.. 150 దేవాలయ మీద దాడి చేసారని అన్నారు. పట్ట పగలు విజయనగరంలో శ్రీరామ చంద్రమూర్తి దేవాలయాన్ని దాడి చేస్తే ఇంత వరకు చెర్యలు తీసుకోలేదన్నారు.
పిఠాపురంలో చాలా ఆలయాల మీద దాడి చేస్తే చర్యలు తీసుకోవడం లేదన్నారు. శ్రీ వెంకటేశ్వర్లు స్వామి తిరుపతి దేవస్థానంలో మొత్తం కమర్షియల్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో వాటర్ బాటిల్ రూ.50 లేదు కానీ.. తిరుపతిలో వాటర్ బాటిల్ రూ.50 ఉందన్నారు. 10 రూపాయలు ఉండవల్సిన లడ్డూ 100 రూపాయలు చేశారని ఫైర్ అయ్యారు. తిరుపతిలో చాలా అపచారాలు చేస్తున్నారని అన్నారు.
Bonda Uma: హిందూవులపై దాడి చేస్తే ఊరుకోం.. వైసీపీకి బోండా ఉమా హెచ్చరిక
సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ పొలిటి బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. రాష్ట్రంలో జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో హిందూ ధర్మం అంటే గౌరవం లేదని విమర్శించారు. వాలంటీర్ల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని.. ప్రజల డేటాను విదేశాలకు అమ్ముకోవాలనేదే జగన్ కుట్ర అని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో హిందూ ధర్మం నియమాలు పాటించకుండా ఉన్నారని దుయ్యబట్టారు.

Translate this News:











