Bomb blasts in Kerala at Kochi Christian Convention Center: హమాస్ చేసిన మెరుపుదాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ భద్రతా దళాలు గాజాలో విధ్వంసం సృష్టించాయి. ఎడాపెడా బాంబుల వర్షం కురిపించాయి. దీంతో.. గాజా పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇప్పటికే వేలాదిమంది అక్కడ మృతి చెందారు. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ప్రపంచదేశాలు ఈ యుద్ధంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ దాడులకు నిరసనగా కేరళలో క్రైస్తవులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ జరిగిన కొద్ది గంటల్లోనే ఓ చర్చిలో బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఆదివారం కావడంతో చర్చ్ ఉన్న కన్వెన్షన్ సెంటర్కు భారీగా క్రైస్తవులు హాజరయ్యారు. ఈ సమయంలోనే వరుస బాంబు దాడులు జరిగాయి. ఈ వరుస బాంబు దాడులతో కొచ్చి నగరం వణికి పోయింది.
పూర్తిగా చదవండి..Bomb blasts in Kerala: బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కేరళ.. అసలేమైందంటే?
కేరళ కొచ్చిలో వరుస బాంబు పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. సిటీలోని క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో మూడు చోట్ల బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లు వార్తలు వస్తున్నాయి. బాంబు పేలుళ్లతో అక్కడంతా భయానకంగా మారింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Translate this News:











