Rangareddy Fire Accident: రంగారెడ్డి జిల్లా షాద్నగర్(Shadnagar) నియోజకవర్గం పరిధిలోని కొందుర్గు మండల కేంద్రంలో గల స్కాన్ ఐరన్ పరిశ్రమలోని(Iron Factory) భట్టిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్ర శివారులోని స్కాన్ ఐరన్ పరిశ్రమలో మంగళవారం ఐరన్ లారీల లోడ్లు అన్లోడింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో భట్టిలో పేలు సంభవించింది. ఈ పేలుడు ధాటికి భారీ శబ్ధాలు వచ్చాయి. దాంతో స్థానికులు హడలిపోయారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికులు కొందరు పరిస్థితిని గమనించి.. బాధితులను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ పేలుడు ధాటికి పలువురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఈ ఘటనలో రెండు లారీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇతర సామాన్లు కూడా దగ్ధమైయ్యాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పేలుడు కారణంగా ఎగసిపడుతున్న మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను షాద్ నగర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. కాగా, ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఫైర్ శాఖ అధికారులు.. విచారణ చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
పూర్తిగా చదవండి..Hyderabad: కొందుర్గు స్కాన్ ఐరన్ పరిశ్రమలో భారీ పేలుడు.. రెండు లారీలు ధ్వంసం..
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం పరిధిలోని కొందుర్గు మండల కేంద్రంలో గల స్కాన్ ఐరన్ పరిశ్రమలోని భట్టిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Translate this News:











