బీజేవైఎం ఆధ్వర్యంలో నేడు ఆందోళనకు పిలుపునిచ్చారు బీజేవైఎం కార్యకర్తలు. నిరుద్యోగ భృతి & గ్రూప్-2 పరీక్ష వాయిదాపై ఉదయం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయాలం ముందు ధర్నా చేయాలని నిర్ణయించారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని బీజేవైఎం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 ఏళ్లగా ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా మోసం చేసిందని నాయకులు ఆరోపించారు. లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్-2 పరీక్షను 3 నెలల సమయం ఇచ్చి.. తరువాత పరీక్ష నిర్వహించాలని ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నేడు కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. ఎన్నికల్లోయువతకు ప్రతినెలా చెల్లిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం.. ఇంతవరకు ఏ ఒక్క నిరుద్యోగికి ఆ పథకం అందలేని మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..బీజేవైఎం కార్యకర్తల ఆందోళన..నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్
తెలంగాణలో రాజకీయ హీట్ పెరుగుతోంది. ఓ వైపు ప్రతిక్షాలు ఆధికార పార్టీపై విమర్శలు చేస్తుంటే.. మరో వైపు కార్యకర్తలు ధర్నాలు చేస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయలేదని ధర్నాలకు పిలుపునిచ్చారు. నిన్న గ్రూప్-2 పరీక్ష రద్దుపై ఆందోళన మర్వక ముందే నేడు బీజేవైఎం కార్యకర్తలు నిరుద్యోగ భృతి & గ్రూప్-2 పరీక్ష వాయిదాపై కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టించారు. దీంతో భాగ్యనగర్‌లో ఒక్కసారిగా హీటెక్కింది.

Translate this News:











