తెలంగాణ ఎన్నికలకు (Telangana Elections) సంబంధించి ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసేందుకు బీజేపీ (BJP) సిద్ధం అవుతోంది. దాదాపు 40 మంది అభ్యర్థులతో ఈ లిస్ట్ విడుదల కానుంది. ఈ మేరకు ఢిల్లీలో కిషన్ రెడ్డి (Kishan Reddy) నివాసంలో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఎన్నికల కమిటీ మీటింగ్ కు ముందు నిర్వహిస్తోన్న ఈ కీలక సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ జరగనుంది. అనంతరం 40 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేయనున్నారు. కాసేపట్లో జేపీ నడ్డాతో తెలంగాణ నేతలు భేటీ కానున్నారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: బీజేపీతో కలిసి పోటీ చేస్తారా లేదా మద్దతిచ్చి తప్పుకుంటారా.. పవన్ దారెటు..
Telangana BJP First List: ఈ రోజే 40 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్.. ఆ నేతలకు ఫ్యామిలీ ప్యాక్?
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ఈ రోజు రాత్రిలోగా విడుదలయ్యే అవకాశం ఉంది. కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి, డీకే అరుణ తదితరులు తమతో పాటు తమ కుటుంబ సభ్యులకు కూడా టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. వీరి వినతికి హైకమాండ్ ఎలా స్పందిస్తుందనే అంశం ఆసక్తిగా మారింది.

Translate this News:











