
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో జాప్యంపై బీజేపీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టింది. వరంగల్ జిల్లాలో బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల.. కేసీఆర్ సర్కార్ సుమారు 45 వేల కోట్ల మద్యం పన్నును రాష్ట్ర ప్రజల నుంచి వసూళ్లు చేసినట్లు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పేదల కోసం ఇండ్లు నిర్మించామని చెప్పుకుంటూ వాటిని పంపిణీ చేయడంలో మాత్రం జాప్యం చేస్తోందని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయకపోవడంతో అవి పలు చోట్ల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయని ఈటల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..











