BJP MP Laxman Comments on BRS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్(Laxman) సంచలన కామెంట్స్ చేశారు. ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది అంటూ సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీలో(Delhi) చక్రం తిప్పుతా అని.. కనీసం బొంగురం కూడా తిప్పలేకపోయారు అంటూ సెటైర్లు, పంచ్‌లతో విరుచుకుపడ్డారు. గురువారం నాడు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్.. ప్రధాని నరేంద్ర మోదీపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్‌కి కౌంటర్ ఇచ్చారు. ప్రధానంగా కేటీఆర్ చేస్తున్న కామెంట్స్‌పై లక్ష్మణ్ సీరియస్‌గా అయ్యారు. బీఆర్ఎస్తో పొత్తుకు సంకేతాలు ఇచ్చినట్లు మంత్రి కేటీఆర్ చెప్పడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచాం తప్ప.. ఎన్నికల్లో ఏనాడూ కలవలేదని క్లారిటీ ఇచ్చారు లక్ష్మణ్. అబద్దాలకు కేరాఫ్ బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. మోదీ అసలు రహస్యాన్ని బయట పెట్టడంతో.. బీఆర్ఎస్ నేతల పరిస్థితి కుడితిలో పడిన ఎలుకల్లా తయారైందన్నారు. అందితే జుట్టు.. లేకపోతే కాళ్లు పట్టుకోవడం బీఆర్ఎస్ నైజం అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పార్టీది పచ్చి అవకాశ వాదం అని, బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పరాన్నజీవి అంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు లక్ష్మణ్. తనను ముఖ్యమంత్రిని చేస్తే టీఆర్ఎస్ దుకాణం బంద్ చేస్తామని చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు లక్ష్మణ్. ‘గత ఎన్నికల్లో సారూ.. కారు.. పదహారు అన్నారు ఏమైంది? ఢిల్లీలో చక్రం తిప్పుతా అన్నారు.. బొంగురం కూడా తిప్పలేదు. ప్రధాని రెండు సభలు ట్రైటర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది.’ అని బీఆర్ఎస్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు లక్ష్మణ్.
పూర్తిగా చదవండి..Telangana:’ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది’.. బీఆర్ఎస్కు బీజేపీ నేత వార్నింగ్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది అంటూ సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీలో చక్రం తిప్పుతా అని.. కనీసం బొంగురం కూడా తిప్పలేకపోయారు అంటూ సెటైర్లు, పంచ్‌లతో విరుచుకుపడ్డారు.

Translate this News:











