వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (GVL Narasimha Rao) తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను ఎలా లాభాల బాట పట్టించాలో ఆలోచిస్తున్నామన్నారు. ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే నడపాలని చూస్తున్నామన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యలపై తాను నిత్యం పార్లమెంట్ లో మాట్లాడుతున్నానని తెలిపారు. ప్లాంట్ కు ముడి సరుకు ఇచ్చేందుకు NMDC సిద్ధంగా ఉందన్నారు జీవీఎల్. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడు మైన్స్ ఎందుకు కేటాయించలేదని ఆయన ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ పరిస్థితిని బీజేపీ చక్కదిద్దుతుందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను గత యాజమాన్యాలు బ్రష్టు పట్టించాయన్నారు. రూ.2 వేల కోట్ల విలువైన వీల్స్ ప్లాంట్ ను RINL కు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ల్యాండ్ ఓనర్ షిప్ RINLకు లేదన్నారు.
పూర్తిగా చదవండి..GVL Narasimha Rao: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బ్రేక్.. బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక ప్రకటన
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ ప్రక్రియ నిలిచిపోయిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను ఎలా లాభాల బాట పట్టించాలో ఆలోచిస్తున్నామన్నారు. ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే నడపాలని చూస్తున్నామన్నారు.

Translate this News:











