Mahua Moitra Took Bribes: టీఎంసీ పార్టీ (TMC Party) ఎంపీ మహువా మెయిత్రాపై బీజేపీ నేత సంచనల వ్యాఖ్యలు చేశారు. ఆమె పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే (Nishikant Dubey) ఆరోపించారు. ఇది తీవ్రమైన నిబంధనల ఉల్లంఘన, కాంటెంప్ట్ ఆఫ్ హౌస్, నేరంగా ఆయన పేర్కొన్నారు. మహువా మొయిత్రా వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకున్నట్లు సాక్ష్యాలను తనతో ఓ న్యాయవాది పంచుకున్నారని నిశికాంత్ దుబే పేర్కొన్నారు. పార్లమెంట్లో అదాని గ్రూప్‌ను లక్ష్యంగా చేసుకొని ఆమె ఇప్పటివరకు 50 నుంచి 61 ప్రశ్నలు అడిగారని తెలిపారు. 2005 డిసెంబర్ 12 నాటి ‘క్యాష్ ఫర్ క్వెరీ’ వ్యవహారాన్ని గుర్తుచేసేలా పార్లమెంట్లో ప్రశ్నలు అడగడం అనేది వ్యాపారవేత్త శ్రీ దర్శన్ హీరానందానీకి చెందిన వ్యాపార ప్రయోజనాలను కాపాడేందుకు మహువా మోయిత్రా పన్నిన నేరపూరిత కుట్ర అనడానికి ఎలాంటి సందేహం లేదని అన్నారు.
పూర్తిగా చదవండి..Mahua Moitra: మహువా మొయిత్రా లంచం తీసుకున్నారు.. బీజేపీ నేత సంచలన ఆరోపణలు
ఎంపీ మహువా మెయిత్రాపై బీజేపీ నేత సంచలన ఆరోపణలు చేశారు. ఆమె పార్లమెంటులో ప్రశ్నలు అడిగడానికి ఓ వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ఆరోపించారు. ఇది తీవ్రమైన నిబంధనల ఉల్లంఘన, కాంటెంప్ట్ ఆఫ్ హౌస్, నేరంగా ఆయన అభివర్ణించారు. దీనిపై విచారణ చేపట్టాలని.. ఆమెను పార్లమెంట్ హౌస్ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరారు.

Translate this News:











