బీజేపీకి విజయశాంతి గుడ్ బై చెప్పనుందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోన్న విషయం తెలిసిందే.తాజాగా ఈ అంశంపై విజయశాంతి స్పందించారు. ట్విట్టర్ (ఎక్స్) ద్వారా తన పార్టీ మార్పుపై రాములమ్మ క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతానంటూ వస్తున్న వార్తలను ఖండిస్తున్నానన్నారు. కొంతమంది తమ పార్టీ నేతలే పనిగట్టుకొని రాములమ్మ బీజేపీకి దూరం అంటూ ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. చిట్ చాట్ ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ తనకు అలవాటు లేదన్నారు. పార్టీ కి ఏది ముఖ్యమో ఆ అంశాలను పార్టీ ప్రధాన నాయకులకు ఈ నెల 16 న ముఖ్య సమావేశంలో స్పష్టంగా తెలియజేశానన్నారు. అంతర్గత విషయాలు బయటకు లీకేజ్ ల పేరుతో ఇవ్వడానికి తాను వ్యతిరేకిస్తానన్నారు.
పూర్తిగా చదవండి..Vijayashanthi: బీజేపీ గుడ్ బై.. క్లారిటీ ఇచ్చిన రాములమ్మ.. పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. సొంత పార్టీ నేతలే ఇలాంటి ప్రచారాలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు.

Translate this News:











